– చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో మాట్లాడి సంఘటన గురించి మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ సోదరులపై దాడి ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. డ్రైవర్‌పై దాడిని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఖండించాయి.
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి మంత్రి పొన్నం ఖండన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



