నవతెలంగాణ – కరీంనగర్
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగరంలో తన నూతన మినిస్టర్ క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుభప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – “ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలతో పాటు ఉండాలి. గతంలో ఉన్న కార్యాలయం భౌగోళికంగా ప్రజలకు సౌకర్యవంతంగా లేకపోవడంతో, మరింత అందుబాటులో ఉండేలా ఈ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం” అని అన్నారు.
ఈ కార్యాలయం ద్వారా ప్రజల ఆర్జీలు, విజ్ఞాపన పత్రాలు స్వీకరించబడతయాన్నారు. సీఎం సహాయ నిధికి సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు. ఇది కేవలం మంత్రి క్యాంప్ కార్యాలయం కాకుండా, ప్రజల సమస్యల పరిష్కార వేదికగా కొనసాగుతుందని మంత్రి వివరించారు. “కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ప్రజలంతా ఈ కార్యాలయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నా” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, పడాల రాహుల్, గడ్డం విలాస్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, మడుపు మోహన్, మల్యాల సుజిత్, ఎం.డి.తాజ్, శ్రావణ్ నాయక్, బోనాల శ్రీనివాస్, కంకణాల అనిల్ కుమార్, ఎస్.ఎ మోసీన్, ముద్దం తిరుపతి, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, ఆకుల ప్రకాష్, పడిశెట్టి భూమయ్య, కట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.