Sunday, July 27, 2025
E-PAPER
Homeజిల్లాలునూతన పెట్రోల్ బంక్ ప్రారంభించిన మంత్రి సీతక్క

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభించిన మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ఆదివారం మండలంలోని మేడారంలో, ఊరట్టం స్థూపం వద్ద సారయ్య పెట్రోల్ బంక్ సమ్మక్క- సారలమ్మ కోమలి ఫిలింగ్ స్టేషన్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. మార్మూల ప్రాంతంలో ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పెట్రోల్ డీజిల్ కొరకు రైతులు మండల కేంద్రానికి రావాల్సి వస్తుంది అని గ్రామంలో ఇండియన్ ఆయిల్ సబ్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రం కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీ సమ్మక సాలమ్మ కోమలి ఫిలిం స్టేషన్ యజమాని కాక సారయ్య, మేనేజర్ శ్రీధర్ కిరణ్ కు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలుపుతూ, నాణ్యత ప్రమాణాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు పెట్రోల్ డీజిల్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, స్థానిక తహసిల్దార్ జె సురేష్ బాబు,  మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, స్థానిక తహసిల్దార్ జె సురేష్ బాబు, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరావు, సీతక్క యువసేన అధ్యక్షులు చెర్ప వీందర్, కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మాజీ ఎంపిటిసి బత్తిని రాజు గౌడ్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -