Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్రెం ఎల్లక్కకు మంత్రి సీతక్క నివాళి 

అర్రెం ఎల్లక్కకు మంత్రి సీతక్క నివాళి 

- Advertisement -

హాజరైన ప్రముఖులు 
నవతెలంగాణ – తాడ్వాయి 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ మాతృమూర్తి ఎల్లమ్మ దినకర్మ గురువారం ఆయన సొంత గ్రామం తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామంలో జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్ ని, వారి కుటుంబాన్ని పరామర్శించారు. దశదినకర్మకు హాజరైన వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు వివిధ పార్టీల నాయకులు, తుడుందెబ్బ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నేతలు, మహిళల సంఘాల నాయకులు కూడా హాజరై ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, ఖమ్మం మాజీ జెడ్పీ చైర్మన్, ఆదివాసి సంఘాల జేఏసీ నాయకులు చందా లింగయ్య దొర, ములుగు జిల్లా జేఏసీ నాయకులు, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షులు ముంజాల బిక్షపతి, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, సిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఇర్సవడ్ల భవాని నారాయణ, 

ములుగు జిల్లాలోని అన్ని మండలాధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు, మాజీ ప్రజా పతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, తుడుం దెబ్బ రాష్ట్ర అద్యక్షులు వట్టం ఉపేందర్, తుడుందెబ్బ నాయకులు, చింత కృష్ణ పూనెం సాయి, అర్రేం నారాయణ, తుడుందెబ్బ ఆదివాసి సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -