- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రెండవ స్థానిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని చిన్నతూoడ్ల గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతిని సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నేపథ్యంలో గురువారం గ్రామ సర్పంచ్ గా అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును హైదరాబాద్ లో మర్యాపూర్వకంగా కలిశారు. ఇందుకు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, షాలువాతో సత్కరించారు.
- Advertisement -



