- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొండ్ర సారయ్య అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్య ఖర్చుల కోసం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు దృష్టికి బాధితుని కుటుంబ సభ్యులు తీసుకపోయారు. స్పందించిన మంత్రి రూ.2 లక్షల ఎల్ఓసి మంజూరు చేసి, మంగళవారం మంత్రి సహచరునితో అందజేశారు. ఇందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



