- Advertisement -
- మహానీయులను గౌరవించని చరిత్ర కాంగ్రెస్‌దే…
- – మంథనిలో మహనీయులన కనబడకుండా చేసింది ఎమ్మెల్యే కుటుంబమే
- – సమాజం కోసం ఏమి చేయని వాళ్ల నాయన విగ్రహాలకు మొక్కుమంటుండ్లు
- – ఐలమ్మ విగ్రహాన్ని ఎందుకు ముట్టుకోరో ఎమ్మెల్యే జవాబు చెప్పాలే
- – మహనీయుల చరిత్ర తెలిసిన రోజు మీ కుర్చీలు కదిలిపోక తప్పదు
- – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
- నవతెలంగాణ – కాటారం
- దేశంలో రాష్ట్రంలో మహనీయులను గౌరవించని, వారి పోరాట స్పూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయని పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ వర్థంతి సందర్బంగా మంథనిలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం సిద్దించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం పట్టుకుని రాష్ట్రం సాధించాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహనీయులను వెలికితీస్తే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐలమ్మ జయంతి వర్థంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి, కనీసం విగ్రహాన్ని శుభ్రం చేయలేదన్నారు.
- ఈ క్రమంలో కాంగ్రెస్‌కు మహనీయులపై ఎలాంటి భావన ఉందో అర్థం అవుతుందన్నారు. మంథని నియోజకవర్గంలో మహనీయులను కనబడనీయకుండా చేసింది ఎమ్మెల్యే కుటుంబమేనని ఆయన అన్నారు. మహనీయుల గురించి వాళ్ల వెంట ఉండేవాళ్లకు అర్థం కాకపోయినా ఈ సమాజానికి అర్థం అవుతుందని తపన పడుతున్నామని అన్నారు. ఈనాడు సోషల్ మీడియా, యూట్యూబ్‌లతో మహనీయుల చరిత్రను దాచిపెట్టాలన్నా దాగే పరిస్థితులు లేవని, సామాన్యులకు అర్థం అవుతుందన్నారు. మహనీయుల చరిత్ర తెలిసిన రోజు మీ కుర్చీలు కదలక తప్పదని ఆయన హెచ్చరించారు. జైపాల్‌రెడ్డిలాంటి నాయకుల విగ్రహాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న ముఖ్యమంత్రికి ఐలమ్మలాంటి పోరాటయోధురాలు విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదని, మంథనిలో మంథని ఎమ్మెల్యేకు చూడబుద్దికావడం లేదా అని ప్రశ్నించారు.
ఐలమ్మ విగ్రహన్ని ముట్టుకోరు…పూలు వేయరు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోవడం లేదని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఈ కులాలను వాడుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ సమాజానికి ఏం చేయని మీ నాయన విగ్రహాన్ని పూజించాలని, మొక్కాలని చెప్తున్నారని, ఇంటింటికో విగ్రహం పెట్టుకున్న వాళ్లకు పదవులు ఇస్తామనడం ఏం నీతి అని ప్రశ్నించారు. మహనీయుల వర్థంతి జయంతులను బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గొప్ప నిర్వహించడంతో పాటు వారి చరిత్రను చాటి చెప్తామని ఆయన ఈసందర్బంగా స్పష్టం చేశారు.
- Advertisement -