నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ (టీఏడీఏ)-2026 డైరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయమే ప్రధాన అజెండాగా పని చేస్తున్న ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖకు చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. శాఖ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.పదోన్నతులు కల్పించడం ద్వారా శాఖలో నూతనోత్సాహంతో అధికారులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మిగతా పదోన్నతులను కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. త్వరలో టీఏడీఏ ప్రతినిధులతో సమావేశమై పలు విజ్ఞప్తులపై సానుకూల నిర్ణయం తీసుకున్నామని భరోసానిచ్చారు. వ్యవసాయ అధికారులు 2047 విజన్ డాక్యు మెంట్‌లో పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీఏడీఏ ప్రతినిధులు మంత్రికి మెమెంటో బహూకరించారు. కార్యక్రమంలో టీఏడీఏ గౌరవ వ్యవస్థాపకులు రాములు, (అగ్రోస్ ఎమ్‌డీ), రాష్ట్ర అధ్యక్షలు సల్మాన్ నాయక్, కార్యదర్శి తిరుపతి నాయక్, కోశాధికారి వి.మధు మోహన్, తదితరులు పాల్గొన్నారు.
అగ్రి డాక్టర్స్ 2026 డైరీని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



