Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకోదాడలో మంత్రి ఉత్తమ్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

కోదాడలో మంత్రి ఉత్తమ్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

- Advertisement -

నవతెలంగాణ-కోదాడటౌన్‌
మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల కోదాడలో అత్యవసర ల్యాండింగ్‌ అయింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటనకు ఏర్పాట్లు జరిగింది. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రి ఉత్తమ్‌ బుధవారం బయల్దేరారు. కోదాడ సమీపంలోకి రాగానే ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, సన్నపాటి వర్షం కూడా ప్రారంభం కావడంతో ఫైలట్‌ అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ సూచన మేరకు హెలికాప్టర్‌ను కోదాడలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. మంత్రి కోదాడ నుంచి హుజూర్‌నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. మంత్రి హెలికాఫ్టర్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం మేళ్లచెరువులో ల్యాండ్‌ కావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -