Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఛత్తీస్‌గఢ్‌ సీఎంతో మంత్రి ఉత్తమ్‌ భేటి

ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో మంత్రి ఉత్తమ్‌ భేటి

- Advertisement -

సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు ఎన్‌వోసీకి హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సారుని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సోమవారం కలిశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్‌వోసీ (నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌) జారీ చేయాలని ఆయన కోరారు. ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే ప్రాంతానికి పరిహారం ఇస్తామని ఉత్తమ్‌ ఈ సందర్భంగా తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు చేపడతామని హామీనిచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకు ఎన్‌వోసీ జారీకి ఛత్తీస్‌గఢ్‌ సీఎం సూత్రప్రాయంగా అంగీకరించటంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ్‌ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌వోసీపై చర్చించేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరుతూ సీఎం విష్ణుదేవ్‌ సారుకు ఇటీవల ఉత్తమ్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణలో నీటి లభ్యతను పెంచేందుకు గోదావరిపై 6.7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సాగర్‌ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు వెనుక జలాల (బ్యాక్‌ వాటర్‌) వల్ల ఛత్తీస్‌గఢ్‌లో కొంత భూభాగం ముంపునకు గురవుతోంది. ముంపు ప్రాంతంలో భూసేకరణ, పరిహారం చెల్లించే విషయంపై ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు సంప్రదింపులు జరిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -