Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంగం బండ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలిన మంత్రులు

సంగం బండ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలిన మంత్రులు

- Advertisement -

నవతెలంగాణ – మఖ్తల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీతో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, సాంకేతిక శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, యువజన క్రీడలు, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం మక్తల్ మండలం సంగం బండ వద్ద, మక్తల్ పెద్ద చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు. రాష్ట్రంలో మత్స్య సంపద ను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అనంతరం రూ.370 లక్షల వ్యయంతో చేపట్టే మక్తల్ మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఈర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్, రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ సాయి, రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల,జిల్లా గ్రంథా లయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -