- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మైనర్లు వాహనాలు నడపవద్దని అసిస్టెంట్ మోటార్ వెహికల్ అధికారులు సాగర్ రోహిత్ రెడ్డి తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాస్ ఉత్సవాల సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని శాంభవి ఉన్నత పాఠశాలలో ట్రాఫిక్ రూల్స్ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించారు. మైనర్ లకు తల్లిదండ్రులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఇటీవల జిల్లా స్థాయిలో అబాకస్ లో నైపుణ్యాన్ని కనబరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాంభవి హై స్కూల్ చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ రవీణ్ ప్రసాద్, ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



