హీరో తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా చిత్రం ‘మిరాయ్’. ఇందులో సూపర్ యోధ పాత్రలో ఆయన అలరించబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 12న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగ ళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హీరో ధ్రువా సర్జా మాట్లాడుతూ, ‘ఈనెల 12న ఒక పండగ లాంటి ‘మిరారు’ సినిమా విడుదలవుతుంది. చాలా అద్భుతమైన నటీనటులు, టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. తేజ, మంచు మనోజ్, జగపతిబాబు, జయరాం, డైరెక్టర్ కార్తిక్, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. విశ్వప్రసాద్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. తేజ చేసిన ‘హనుమాన్’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘మిరారు’ టీజర్, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమాని కన్నడ ప్రేక్షకులందరూ చూసి గొప్పగా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
‘కన్నడ ప్రజలందరికీ నమస్కారం. ఇంత వానలో మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా పడతాను. ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన యాక్షన్ ప్రిన్స్ ధ్రువకి థ్యాంక్స్. ‘హనుమాన్’ సినిమాకి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయన నాకు లక్కీ చార్మ్. ఈ సినిమాతో కూడా అది రిపీట్ కాబోతోంది. ఇదొక యాక్షన్ అడ్వెంచర్స్ ఫాంటసీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిల్మ్. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయదగ్గ సినిమా’ అని హీరో తేజా సజ్జా చెప్పారు.
నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ,’మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ధ్రువతో కలిసి సినిమా చేయబోతున్నాం. ‘మిరారు’ కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం. చాలా లార్జ్ స్కేల్లో తీసిన సినిమా ఇది. మీ అందరిని అలరిస్తామని నమ్మకం ఉంది. ఈనెల 12న అందరూ థియేటర్స్‌కి వచ్చి మా చిత్రాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘మిరాయ్’ పండగ లాంటి సినిమా
- Advertisement -
- Advertisement -