‘హనుమాన్, మిరాయ్’ రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సక్సెస్‌లు వచ్చినప్పుడు సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతాం. మా నిర్మాత, దర్శకుడు, హీరో, టీమ్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అన్నింటికి మించి ‘హనుమాన్’ తరువాత మిరాయ్’ సంగీతానికి మంచి స్పందన రావడం మరింత ఆనందంగా ఉంది’ అని సంగీత దర్శకుడు హరి గౌర అన్నారు. హీరో తేజ సజ్జా ‘మిరాయ్’తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల రిలీజై, అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర సోమవారం మీడియాతో సంభాషించారు. దర్శకుడు కార్తీక్ చాలా అద్భుతమైన పిక్చర్ తీశారు. ఆ పిక్చర్ నన్ను మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ఇన్‌స్పైర్ చేసింది. సినిమా చూస్తున్నప్పుడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి దగ్గరగా ఉందనిపించింది. సినిమా విడుదల తరువాత నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి.
ఆడియన్స్ థియేటర్‌లో గ్రేట్ మ్యూజిక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కీరవాణి లాంటి లెజెండరీ కంపోజర్‌తో నన్ను పోల్చడం నాకు ఒక భయాన్ని తీసుకొస్తుంది. భవిష్యత్తులో తెలిసో, తెలియక ఏదో ఒక చిన్న తప్పు చేసినా అది నాకు పెద్ద అపవాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది (నవ్వుతూ). ఈ సినిమాలో మ్యూజిక్ చేయడానికి నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించిన విషయం ఒకటే..ఇందులో ప్రతి పాత్రకి వెయిటేజ్ ఉంది. ప్రతి పాత్ర గొప్ప మ్యూజిక్ ఇవ్వడానికి ప్రేరణ ఇచ్చింది. ‘మిరాయ్’ ఆయుధానికి లార్డ్ శివ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం)ను, అలాగే శ్రీరాముడి ఆయుధం అయినప్పటికీ దానికి పినాక అనే పేరు ఉంది. ఆ స్ఫూర్తితో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. ఈ సినిమా కోసం రకరకాల జోనర్స్‌ని వాడాను. ఇంత గ్రేట్ మ్యూజిక్ రావడానికి మా నిర్మాతల ప్యాషన్, సపోర్టే కారణం. వారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే వరుసగా నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను.
‘మిరాయ్’ సంగీతానికి అద్భుతమైన రెస్పాన్స్
- Advertisement -
- Advertisement -