పేదలకు బియ్యం పంపిణీ చేసిన రాజిరెడ్డి
నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండల కేంద్రంలోని సెంటినరీ కాలనీలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఏస్ యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజీ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో పేదలకు 50 కేజీల బియ్యం పంపిణీ చేశారు. కొమిరే దుర్గమ్మ అనే వృద్ధురాలు ఇటీవలమృతి చెందగా.. నిరుపేదలైన ఆమె కోడలు రాజమ్మ, లక్ష్మీలకు ఈ బియ్యం అందించారు.
ఈ కార్యక్రమంలో పాశం శ్రీనివాస్ రెడ్డి, పింగిలి సంపత్ రెడ్డి,బోయినపల్లి శ్రీకాంత్ రావు, వీరగోని సంతోష్ గౌడ్,నడిపెల్లి ప్రదీప్ రావు,బొడిగ క్రాంతి కుమార్,రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్,చిరంజీవి,గండి శ్రీనివాస్, రాము, మారుతి, సురేందర్రావు, కేశవరావు, ఒర్రె సురేష్ పాల్గొన్నారు.