Sunday, December 14, 2025
E-PAPER
Homeకరీంనగర్మిషన్ భగీరథ నీరు వృధా.. పట్టించుకోని అధికారులు

మిషన్ భగీరథ నీరు వృధా.. పట్టించుకోని అధికారులు

- Advertisement -

•వారం రోజులుగా వృధా అవుతున్న నీరు : బండి రమేష్ 
నవతెలంగాణ – రామగిరి 

రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామ శివారు స్మశాన వాటికకు దగ్గరలో మిషన్ భగీరథ నీరు చెక్వాల్ చెడిపోయి మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి వెంబడి దాదాపు 5 హెచ్పి మోటర్ పంపు పోసినట్టుగా వృధాగా పోతున్నాయి. గత వారం రోజులుగా ఈ నీరు వృధా అవుతున్న సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని సమీపంలోని గ్రామస్తుడు బండి రమేష్ తెలిపారు. మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి వెంబడి ఈ విధంగా నీరు వృధా అయిన నిత్యం వేలాది మంది రాకపోకలు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడి నుండి అన్ని డిపార్ట్మెంట్లో సంబంధించిన అధికారులు కూడా వెళ్తుంటారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటిని వృధా చేయవద్దని నాగేపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -