తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానములు (టీటీడీ) ఛైర్మన్ బిఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు వైరల్ కావడం ఆదివారం కలకలం రేపింది. అయితే ఈ వీడియోలన్నీ ఫేక్ వీడియోలుగా బిఆర్ నాయుడు కొట్టిపారేశాడు. టీటీడీ ఛైర్మన్‌గా ఉంటూ అనైతికంగా వ్యవహరించిన బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైసిపి నేత, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
నీచరాజకీయాలు : బిఆర్.నాయుడు
తాను ఉన్నట్లుగా పేర్కొంటున్న వీడియోలన్నీ డీప్ ఫేక్ వీడియోలని, నీచ రాజకీయాల్లో భాగంగానే కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడాడుతూ ఇలాంటి చర్యలతో తనను భయపెట్టలేరని, వైసిపి నాయకుల అవినీతి బండారం బయట పెడుతున్నామనే ఇలాంటి నీచరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నవి 20 సంవత్సరాల క్రితం వీడియోలని, వాటిని ఎఐ టెక్నాలజీతో తన రూపం అనుకరించేలా ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
రాజీనామాకు భూమన డిమాండ్
నైతిక విలువలుంటే టిటిడి చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ హయాంలో ఎస్‌విబిసి చైర్మన్‌పై ఆడియో క్లిప్ వెలుగులోకి రాగానే ఆయనను ఆ పదవి నుంచి తొలగించామని గుర్తు చేశారు. సిఎం చంద్రబాబుకు ఏ మాత్రం వెంకటేశ్వరస్వామిపై గౌరవం ఉన్నా వెంటనే బిఆర్ నాయుడును బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
టీటీడీలో వీడియోల కలకలం
- Advertisement -
- Advertisement -



