నవతెలంగాణ – మద్నూర్
శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభోత్సవం సందర్బంగా.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జుక్కల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలు నీట మునగడంతో పంట నష్టం, ఆస్థి నష్టం వాటిల్లిందని తెలిపారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదనిఅన్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు కల్వర్టుల మరమ్మత్తులు & పునర్నిర్మాణం కోసం అదేవిధంగా వరదల వల్ల నీట మునిగిన పంటలకు నష్ట పరిహారం మరియు జరిగిన ఆస్థి నష్టానికి గానూ,నష్ట నివారణ చర్యల కోసం ప్రత్యేక ప్యాకేజి, నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ లతో నివేదికలు తెప్పించుకొని వెంటనే అవసరమైన నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు.
జుక్కల్ నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజి ఇవ్వాలని సీఎంకి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES