Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వంట మనిషి ఆత్మహత్య

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వంట మనిషి ఆత్మహత్య

- Advertisement -

– ఆర్థిక ఇబ్బందులే కారణం
నవతెలంగాణ-యాదగిరిగుట్ట

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి యాదగిరిగుట్టలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపి వివరాల ప్రకారం.. మండలంలోని సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి(38) కొంతకాలంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ.. అక్కడే కుటుంబంతో పై ఫ్లోర్‌లో నివాసముంటున్నాడు. అయితే, ఆర్థిక సమస్యలతోపాటు ఇటీవల తన ఇంటిపై తీసుకున్న రుణానికి ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంక్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. అప్పు తెచ్చిన వారి నుంచి కూడా ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంట్లోని ఫోర్త్‌ ఫ్లోర్‌కి వెళ్లి రేకుల షెడ్డులో ఉరేసుకు న్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని కుటుంబం సమక్షంలోనే కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య గంధమల్ల నవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ భాస్కర్‌ వివరించారు. ఈ విషయంపై ఎవరైనా నిరాధారణమైన ఆరోపణలు సోషల్‌ మీడియా ద్వారాగానీ, మరే విధంగానైనా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad