Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 8 డివిజన్లకు ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియామకం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 8 డివిజన్లకు ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియామకం

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ని జూబ్లీహిల్స్ పరిధిలోని ఎనిమిది డివిజన్లకు ఇన్‌చార్జిగా నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని విశ్వసిస్తున్నాను. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ని అధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తాం. నాకు కేటాయించిన ఎనిమిది డివిజన్లలో ఇంటింటికి తిరిగి పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతాను,” అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డివిజన్ ఇన్‌చార్జీలు, డివిజన్ అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -