Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాలపాడు నూతన సర్పంచ్ కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సన్మానం 

మాలపాడు నూతన సర్పంచ్ కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట మండలంలోని మాలపాడు గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున నూతనంగా సర్పంచ్‌గా గెలుపొందిన దేవుని సంతోష్ గౌడ్‌ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో శాలువా వేసి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాలపాడు సర్పంచ్ దేవుని సంతోష్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆశీస్సులు, మాలపాడు గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజన్నల మొగులయ్య, వార్డు సభ్యులు కలీం, ప్రభు, పులమ్మ, రవి గౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణతో పాటు మల్లేశం, అంసమ్మ, శేఖర్, దస్తగిరి, మానయ్య, మోహన్, యాదయ్య, శేఖర్, ప్రవీణ్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -