Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్య బాధితుడికి ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

అనారోగ్య బాధితుడికి ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి ఎల్ఓసి అందజేశారు. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన జెనిల సాయిబాబా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తమకు మెరుగైన వైద్య చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోవడం లేదంటూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డిని తమకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.  అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి రూ. 2లక్షల, 50 వేల, రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ ఓ సి నీ గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హైదరాబాద్ మాదాపూర్ లోని తన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపత్కాలంలో తమకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -