నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) ను సందర్బంగా పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించిన అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు వారి సహకారం తో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం ను జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
అందులో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధినిర్వహణలో అమరులైన పోలీసు వీరులను ఈ సమాజం ఎప్పుడూ గుర్తుకు ఉంచుకుంటుందని తెలిపారు. వారి యొక్క అడుగుజాడల్లో నడచి వారి యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు, ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు, రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందించడం గొప్పతనమని రక్తదానం ప్రాణదానంతో సమానమని
అమ్మ జన్మనిస్తే రక్తదానం పునర్జన్మ నిస్తుందని అన్నారు. ఒక్క రక్తదానంతోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేయడం సాధ్య మవుతుందన్నారు. మంగళవారం రక్తదానం చేసిన పోలీస్ అధికారులు సిబ్బంది వివిధ యువజన సంఘాలు యువకులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 37 యూనిట్ల రక్తం ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు సేకరించారు. అనంతరం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నివారణ యూనిట్, భరోసా, షి టీం, సైబర్ క్రైమ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాఫిక్, ఆయుధ ప్రదర్శన, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్టాల్ లను పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా లో మాదక ద్రవ్యాల నివారణ పోలీస్ వారు తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు వాటి పై చైతన్యం కల్పిస్తున్న తీరును, వాటినీ వినియోగిస్తున్న వారి ప్రవర్తనలో వచ్చే మార్పు ను వివరించారు. లైంగిక వేదింపులకు గురైన బాధిత మహిళలకు భరోసా సిబ్బంది వైద్య, న్యాయ, సైకలాజికల్ సపోర్టు అందిస్తున్న తీరును, ఇప్పటి వరకు బాధిత మహిళలకు పొందిన నష్టపరిహారం, ఉపాధి కల్పన వివరాలు తెలియజేశారు. మహిళ విద్యార్థులను వేదిస్తున్న ఈవ్ టీజింగ్ కు షి టీమ్ చేపడుతున్న చర్యలు, ఇప్పటి వరకు నమోదు చేసిన వివరాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్న అవగహన కార్యక్రమాల వివరాలు ముఖ్య అతిథులకు వివరించారు. అలాగే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, అత్యాశకు పోయి అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చే మొబైల్ లింక్ నొక్కడం ద్వారా బ్యాంకు అకౌంట్ వారికి హ్యాక్ అయి డబ్బులు కోల్పోవడం, ఇప్పటి వరకు ఫ్రిజ్ చేసిన అమౌంట్ వివరాలు, బాధితులకు అందించినా నగదు వివరాలు , పాపిలాన్ డైవిస్ ద్వారా నేరస్తులను గుర్తించడం గురించి ట్రాఫిక్ నియమాలు, సైన్ బోర్డ్స్, ఆయుధాల వినియోగం, అత్యాధునిక టెక్నాలజీ తో తయ్యారు అయిన ఆయుధాల ప్రదర్శనను, డాగ్స్ స్క్వార్డ్, బాంబు దిస్పోజల్ టీం అపనితీసును పరిశీలించారు.
అనంతరం గద్వాల్ కేంద్రానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని వీక్షించగా వారికి ఆయా విభాగాల పని తీరును, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, అత్యవసర సమయాలలో ఉపయోగించే డయల్ -100, షి టీం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె.శంకర్, డి.ఎస్పి మొగిలయ్య, సాయుధ దళా డి.ఎస్పి నరేందర్ రావు, గద్వాల్ మార్కెట్ కమిటీ చెర్మన్ కుర్వ హనుమంతు, కార్యాలయ ఏ ఓ సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ రవి, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఆలంపూర్, గద్వాల్, శాంతి నగర్ సిఐ లు రవి బాబు, శ్రీనివాస్, టాటా బాబు, ఆర్ ఐ లు వెంకటేష్, హరీఫ్, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు,బ్లడ్ బ్యాంకు అధికారులు నవీన్ క్రాంతి, సిబ్బంది రాకేష్,ఖాజా బాషా, ఫిరోజ్, వెంకటేశ్వర్ రెడ్డి, మల్లేష్, చిన్న లక్ష్మి, అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.