పాఠశాల ఆకస్మిక తనిఖీ..
విద్యార్ధులకు ఆంగ్ల బోధన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రతీ ఒక్కరికి వృత్తితో ప్రవృత్తి ఉంటుంది. అయితే ప్రవృత్తి ప్రధానం అయినా కొందరికి వృత్తి తాలుకు వ్యాపకాలు వెంటాడుతుంటాయి.దీంతో అవకాశం వస్తే చాలు ఆ అవకాశాన్ని కొందరు వినియోగించు కుంటారు.
ఉపాద్యాయ వృత్తిని వదిలి ప్రవృత్తిగా రాజకీయాల్లోకి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వృత్తి తాలూక వ్యాపకాలు ఏదో సందర్భంలో,ఏదో కార్యక్రమంలో ఆయన వ్యక్తం చేయడం మే కాకుండా ఆ వృత్తికి చెందిన ఏదో ఒక విషయాన్ని సార్ధకం చేస్తుంటారు.అందుకేనేమో ఆయన పాల్గొన్న ప్రతీ కార్యక్రమంలో నూ అది ఏ రంగం అయినా విద్యారంగం గురించి ప్రస్తావిస్తున్నారు.
గురువారం ఆయన అధికారిక పర్యటనలో భాగంగా మండలంలోని అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను,అదే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్ధులను నేరుగా పాఠ్యాంశం లోని విషయాలను ప్రశ్నించారు.పనిలో పనిగా ఆంగ్లం లోని అక్షరాలను బోర్డ్ పై రాసి విద్యార్ధులకు చూపించారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలతో పాటు నేల పై కూర్చుని అక్షరాలను దిద్ది చూపారు.పిల్లల ప్రదర్శించిన తెలివితేటలు తో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేసారు. ప్రధానోపాధ్యాయుడు భాస్కర్,ఉపాద్యాయులు రాము,ప్రసాద్ లను అభినందించారు.