– రాష్ట్ర స్థాయిలో ఒక్కరు, జిల్లా స్థాయిలో నలుగురు, మండల స్థాయిలో 17 మంది
నవతెలంగాణ – అశ్వారావుపేట
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 5 వ తేదీన నిర్వహించే అధికారిక గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ బోధన చేసిన ఉపాధ్యాయులను గుర్తించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు.
2025 – 2025 విద్యా సంవత్సరానికి గాను అశ్వారావుపేట మండలం నుండి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్ కుమార్, జిల్లా స్థాయిలో నలుగురు ఎంపీపీ ఎస్ నారంవారిగూడెం, మామిళ్ళవారిగూడెం, గాండ్లగూడెం, ప్రధానోపాద్యాయులు పి.చంద్రశేఖర్ రావు, బి.నరసింహం, బి.శ్రీశైలం(సిద్దు), అశ్యారావుపేట చిన్నం శెట్టి బజార్ ఎంపీపీ ఎస్ ఎస్జీటీ వి.బాబురావులు, మండల స్థాయిలో 17 మంది జెడ్పీ హెచ్ ఎస్ మామిళ్ళవారిగూడెం, అచ్యుతాపురం,గుమ్మడి వల్లి, అశ్వారావుపేట, నారాయణపురం ఉపాద్యాయులు తాటి శ్రీనివాసరావు, మడకం వెంకటేశ్వర్లు, బి. రామచంద్రరావు,కట్టా శ్రీనివాసరావు, ఎం.లక్ష్మయ్య,బి.సాయిబాబు, జెడ్పీ జీ హెచ్ ఎస్ అశ్వారావుపేట ఉపాద్యాయురాలు ఎం.నర్మద, ఎంపీయూపీఎస్ ఆసుపాక, నారం వారి గూడెం, పండువారిగూడెం, టి .శ్రీనివాసరావు, కే విజయలక్ష్మి, ఎల్.రేణుక, టి.బాలు నాయక్, ఎంపీపీ ఎస్ గాండ్లగూడెం, మామిళ్ళవారిగూడెం, అశ్వారావుపేట, వినాయక పురం కాలనీ, అచ్యుతాపురం, కోయ రంగాపురం, బి.శ్రీ శైలం, బి.నరసింహారావు, బి ఎస్ వి సత్యనారాయణ, రోజా కుమారి, సున్నం ప్రసాద్, ఎన్. రమణయ్య లు ఎంపిక అయ్యారు.
అయితే శుక్రవారం సెలవు దినం కావడంతో గురువారం మే ఎంఈఓ ప్రసాదరావు అద్యక్షతన ముందస్తు గా నిర్వహించిన గురుపూజోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరై మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను, మండలంలో ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సీహెచ్.వెంకయ్య,ఆర్.పద్మావతి, మల్లికార్జున్ రావు,గాలిబ్ బేగం, పెద వెంకటేశ్వర్లు ను శాలువాలతో సన్మానించారు.