అత్యవసర సర్జరీ కోసం రూ.80 వేల ఎల్ ఓసీ మంజూరు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ను మంగళవారం సందర్శించారు. తన నియోజక వర్గం పరిధిలోని దమ్మపేట మండలం మందలపల్లి కి చెందిన పాలడుగుల శిరోమణి అత్యవసర శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో ఉచిత వైద్యం పొందేలా చేయూత నిచ్చారు. రూ.80 వేల విలువైన ఎల్ ఓసి చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం అదే ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న చుండ్రుగొండ కు చెందిన కుక్కముడి కౌసల్య తిప్పనపల్లి కి చెందిన రాజబోయిన అలివేలు ను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందజేయాలని సంబంధిత డాక్టర్లకు సూచించారు.
నిమ్స్ ను సందర్శించిన ఎమ్మెల్యే జారె..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES