నవతెలంగాణ-అశ్వారావుపేట: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం..అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నేతృత్వంలో, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రహమత్ నగర్ పరిధిలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే జారె గృహాలను సందర్శిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకొని, నవీన్ యాదవ్ విజయం.. కేవలం అభ్యర్థి గెలుపు మాత్రమే కాదని, జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ అభ్యర్థికి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “నవీన్ యాదవ్ గెలుపుతో జూబ్లీహిల్స్ కు అభివృద్ధి, పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుంది” అన్నారు. ప్రచార బృందానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు నివాసితులు తమ మద్దతును వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అశ్వారావుపేట మండల అధ్యక్షుడు తుమ్మ రాంబాబు, బండి చెన్నారెడ్డి, మిండా హరిబాబు, ఆకుల శ్రీను, నార్లపాటి దివాకర్, కరీం, నాగు నాగ కిషోర్, మూర్తూజ, రహమత్ తదితరులు పాల్గొన్నారు



