Wednesday, August 13, 2025
EPAPER
spot_img
Homeతాజా వార్తలుఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు తీవ్ర అస్వస్థత

ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు తీవ్ర అస్వస్థత

- Advertisement -

– గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
– ప్రమాదమేమీ లేదు..48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో.. : డాక్టర్లు
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స నందిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యం అందించిన డాక్టర్లు ఆయనకు ఎలాంటి ప్రమాదమూ లేదని, 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. వైద్యానికి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఆస్పతికి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదిలా ఉండగా, పలు సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే చనిపో యినట్టు వార్తలు రావడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య వార్తలను ఎవరూ నమ్మొద్దని డాక్టర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad