Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అధికారులతో ఎమ్మెల్యే సమావేశం..

అధికారులతో ఎమ్మెల్యే సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ఆయా శాఖల అధికారులతో గురువారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పట్టణ కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి అధికారి తమ విధులను నిజాయితీగా నిర్వహించాలని, సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారుల నుండి వివరాలు సేకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సునీత, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పశు వైద్యాధికారి దేవేందర్, ఎంఈఓ రాజకిరణ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad