నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల కుమార్ గణేష్ మండలి వద్ద శుక్రవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాతారావుప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం సాయి పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యేకు సన్నిహితునిగా పేరు ప్రతిష్టలు పొందిన సాయి పటేల్ కుమార్ గణేష్ మండలి లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎమ్మెల్యేను పిలిపించి గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట సాయి పటేల్, మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాయ్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వట్నాల రమేష్, యువ నాయకులు బండి గోపి, కుమార్ గణేష్ మండలి నిర్వాహక సభ్యులు భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కుమార్ గణేష్ మండలి వద్ద అన్నదానం చేసిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES