Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వల్మిడి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

వల్మిడి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని సోమవారం మండలంలోని వల్మీడీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఝాన్సీ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఝాన్సీ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ముందు నుండి ఝాన్సీ రెడ్డి ప్రజా సేవకు అంకితమయ్యారని, అదే స్ఫూర్తితో ప్రజాసేవలో కొనసాగుతున్నారని కొనియాడారు.

పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఝాన్సీ రెడ్డికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఝాన్సీ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతరావు, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, నాయకులు చంద్రయ్య, బీసు లలిత, రాజేష్ నాయక్, భాస్కర్ గౌడ్, రమేష్ గౌడ్, వాసూరి రవి, మహేందర్ రెడ్డి, హరీష్, భాస్కర్ లతోపాటు అర్చకులు డివిఆర్ శర్మ, మత్తగజం నాగరాజు, చక్రవర్తుల సుందరాచార్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad