Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త, తన అభిమాని మెట్టు సాయన్న కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మెట్టు సాయన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని మృతుడు మెట్టు సాయన్న కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -