Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిలిచిపోయిన రోడ్లను తిరిగి ప్రారంభించిన ఎమ్మెల్యే

నిలిచిపోయిన రోడ్లను తిరిగి ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష
నవతెలంగాణ – వనపర్తి 
: నిలిచి పోయిన రోడ్ల విస్తరణ పనులు స్థానిక ఎమ్మెల్యే ప్రజల కోరిక మేరకు తిరగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రోడ్డు పనులు చేయిస్తున్నందుకు తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా కర్నూల్ రోడ్ పాన్ గల్  కొత్తకోటరోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో రోడ్డు కటింగ్ పెండింగ్ లో ఉంచినట్లు ప్రచారంలో ఉంది.  ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే తూడిమెగా రెడ్డి కర్నూల్ రోడ్ పానగల్ రోడ్డు విస్తరణలో నష్టపోయే బాధితులను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

కర్నూల్ రోడ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ తన భవనాన్ని స్వచ్ఛందంగా కూలగొట్టుటకు ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయనను ఎమ్మెల్యే మెగా రెడ్డి అభినందించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వివేకానంద రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు నుండి మరికుంట వరకు, పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు వెడల్పు పనులు వేగవంతంగా చేయిస్తున్నందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల వరకు వనపర్తిలో రోడ్ల విస్తరణ  పనులు త్వరగా పూర్తి  చెయ్యాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డికి, కలెక్టర్ మున్సిపల్ ఆర్ అండ్ బి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్న  ఎమ్మెల్యే మెగా రెడ్డికి జిల్లా అధికారులకు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -