నవతెలంగాణ – జుక్కల్ : చినుకు పడితే చిత్తడే అనే శీర్షిక నవతెలంగాణ వెబ్ వార్తలు జులై రెండవ తేదీన ప్రచురితమైంది. ఈ వార్తను చదివిన కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు, యూత్ నాయకులు, పాఠకులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వెనువెంటనే శుక్రవారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ పటేల్ ను త్వరగా బస్టాండ్ ప్రాంతంలో ఉన్న గుంతలను పూడ్చీ వేసి శుభ్రం చేయించాలని ఆదేశించారు. మళ్లీ ఇటువంటి సమస్యలు తలెత్తకుండా బస్టాండ్ ప్రాంతమంతా శుభ్రంగా ఉంచాలని, వనమోత్సవ కార్యక్రమంలో చెట్లు నాటాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే స్పందించడం ప్రయాణికులకు ఎంతో మేలు కలిగిందని, ఇట్టి పనులను వెనువెంటనే చేయించడం చాలా సంతోషకరమని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
నవతెలంగాణ శీర్షికకు స్పందించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES