Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంది విత్తనాల పంపిణీలో ఎమ్మెల్యే తోట

కంది విత్తనాల పంపిణీలో ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా అందించే కంది విత్తనాలను మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు రైతులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఏఈవోలు విశాల్ గౌడ్, సౌమ్య, మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ ఆర్ఐ శంకర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -