- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వివాహ వేడుకలు, శారీ ఫంక్షన్‌లు మరియు ఇతర శుభకార్యాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతా రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు, పెద్దలతో స్నేహపూర్వకంగా కలిసిపోయి మాట్లాడుతూ వారి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమవుతూ వారి సంతోషాల్లో భాగస్వామ్యం కావడం, వారి కుటుంబ సభ్యులలో ఒకడిగా ఉండడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
- Advertisement -



