Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ మండపాలకు సహకారం అందించిన ఎమ్మెల్యే

గణేష్ మండపాలకు సహకారం అందించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ధన్ పాల్ లక్ష్మీ బాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ గణేష్ మండపాలకు రెండో రోజు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  ఆర్ధిక సహకారం కార్యక్రమాన్ని కొనసాగించారు. రెండో రోజు కూడా భారీగా మండపం నిర్వాహకులు రావడంతో వారికీ ఇబ్బంది లేకుండా పది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ.. బాల గంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహారాజ్ లను స్ఫూర్తిగా తీసుకొని హిందువులలో ఐక్యమత్యం పెంపొందించడానికి గత పదేళ్లుగా ధన్ పాల్ లక్ష్మీ బాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ పేరుమీద ఇందూర్ నగర గణేష్ మండపాలకు తన వంతు ఆర్ధిక సహకారాన్ని రెండు రోజుల్లో దాదాపు ఏడు వందల మండపలకు సహకారం అందించారు.

గణపతి నవరాత్రులను యువత భక్తిశ్రద్దలతో నియమ,నిష్ఠలతో జరుపుకోవాలని విగ్రహ ప్రతిష్టపన నుండి నిమజ్జనం వరకు ఎటువంటి అవంచానియా సంఘటనలు జరుగకుండా కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహారించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు హిందూ బంధువులందరు వీలైనంత వరకు మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ ఇందూర్ అర్బన్ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనపాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -