నవతెలంగాణ-పాలకుర్తి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వినాయకుడిని మండల కేంద్రంలో గల కోనమ్మ కుంటకు ఆటపాటలతో నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి వినాయకుడిని పూజించాలని సూచించారు. రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలు వాతావరణ కాలుష్యం చేస్తాయని తెలిపారు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ లు అడ్డూరి రవీందర్రావు, వీరమనేని యాకాంతరావు, ఆలయ మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, పాలకుర్తి పట్టణ అధ్యక్షుడు కమ్మగాని నాగన్న గౌడ్, నాయకులు పెనుగొండ రమేష్, బొమ్మగాని భాస్కర్ గౌడ్, మారం శ్రీనివాస్, బండిపెళ్లి మనమ్మ, ఎండి మదర్, జలగం కుమార్, గడ్డం యాకమ్మయ్య, కారుపోతుల శ్రీనివాస్ లతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా గణేష్ నిమజ్జనాలు
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయి. నిమజ్జనాల సందర్భంగా శోభాయాత్ర పాలకుర్తి మండల కేంద్రంలో ఆకట్టుకున్నాయి. నవరాత్రి ఉత్సవ కమిటీలు ఆటపాటలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జనం సందర్భంగా కోనమ్మకుంట వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మండలంలోని వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయి.
