Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహరీష్‌ రావుపై జాగృతి అధ్య‌క్షురాలు కవిత సెటైర్లు

హరీష్‌ రావుపై జాగృతి అధ్య‌క్షురాలు కవిత సెటైర్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావుపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు వేశారు. హరీష్‌ రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్ షూటర్ అని ఎద్దేవా చేశారు. ఆయనే (హరీష్‌ రావు) సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు.

ఆయనే సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌.. హరీష్‌పై ఎందుకు చేయడం లేదు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్‌ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేస్తుంటే హరీష్‌ రావు వద్దన్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుంటే నేరుగా వెళ్లి నేరుగా వైఎస్ఆర్‌ను హరీష్‌ కలవలేదా?’ అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad