నవతెలంగాణ-మర్రిగూడ
76వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్ మరియు విద్యార్థులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చేత భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాలలో స్టూడెంట్ అసెంబ్లీ(మాక్ అసెంబ్లీ) నిర్వహించారు. విద్యార్థులు ప్రజా ప్రతినిధుల వేషాధారణలతో ఆకట్టుకున్నారు.ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ,హక్కులు,రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం అనీ రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పాఠశాలలో మాక్ (స్టూడెంట్) అసెంబ్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


