Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక 

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఎస్. బుచ్చిబాబు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ..  సిద్దిపేటలోని టీటీసీ భవన్ లో 12 విభాగాల్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో మోడల్ స్కూల్ కు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులు నాజియా గ్రూప్, ఐశ్వర్య, సృజన, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి క్రాంతి కుమార్ లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓ జే. ప్రభుదాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మీ నర్సవ్వ, ప్రిన్సిపల్ ఎస్. బుచ్చిబాబు, ఉపాధ్యాయ బృందం, సీఆర్ పీ నవీన్ లు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -