Sunday, July 27, 2025
E-PAPER
Homeజిల్లాలుమేడారం గద్దెల ఆవరణలో ఆధునీకరణ పనులు

మేడారం గద్దెల ఆవరణలో ఆధునీకరణ పనులు

- Advertisement -

జాతర చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి 
జంపన్నవాగు  పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి 
రూ.150 కోట్లతో శాశ్వత నిర్మాణ పనులు : మంత్రి దనసరి (అనసూయ) సీతక్క 
వనదేవతలకు ప్రత్యేక మొక్కలు 
నవతెలంగాణ – తాడ్వాయి 

మేడారం సమ్మక్క సారలమ్మ ఆదివాసి ఆరాధ్య దైవాల గద్దెల ఆవరణలో మాస్టర్ ప్లాన్ తో చేపట్టే ఆధునీకరణ పనులు సమ్మక్క సారలమ్మ ఆదివాసి పూజారుల అభిప్రాయం మేరకే వనదేవతల ప్రసిస్త్యం ముందు తరాలకు అందించేందుకు శాశ్వత నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం మేడారంలో ఊరట్టం స్తూపం వద్ద సమ్మక్క- సారలమ్మ కోమలి ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులు ప్రారంభించారు. అనంతరం వనదేవతలను దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు.

విలేకరులతో మాట్లాడుతూ మేడారం మాహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో అన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వనదేవతల అభివృద్ధి కొరకు ఎన్ని కోట్లయినా నిధులు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికే జాతరలో శాశ్వత పనులు నడుస్తున్నాయని తెలిపారు. జంపన్న వాగు ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జంపన్న వాగు వద్ద నుండి మధ్యలో డివైడర్లతో డబుల్ లైన్ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. వనదేవతలను దర్శించుకోవడానికి గద్దెల ప్రాంగణంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకోవడానికి అణువుగా వరుసగా వనదేవతల గద్దెల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఏది చేసినా పూజారులకు, ఆదివాసి సంప్రదాయాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఒకే వరుసలో వనదేవతల గద్దెలు ఉండడం వలన భక్తులు సునాయాసంగా దర్శించుకునేందుకు వీలుగా ఉంటుందని పోలీసులు, పూజారులు, అధికారుల సమక్షంలోనే గద్దెల ఆవరణలో శాశ్వత పనులు చేపడతామని వివరించారు. ఇందులో ఎలాంటి అపోవులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వవచ్చని, కానీ రాజకీయాలు చేయరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్ర, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ములుగు డి.ఎస్.పి రవీందర్, మండల కమిటీ అధ్యక్షులు బొల్లు దేవేందర్, పిఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు, సీతక్క యువసేన అధ్యక్షులు చెర్ప వీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -