Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుదొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ..

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ..

- Advertisement -

వెంటనే ప్రధానిగా మోడీ రాజీనామా చేయాలి 
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్

దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడని వెంటనే ప్రధానిగా మోడీ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. మోడీ దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమంలో పోలీసులు మరియు కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. విజయవంతంగా కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ ను తన గుప్పిట్లో పెట్టుకొని దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి రావడం జరిగిందని, రాహుల్ గాంధీ ఓట్లలో దొంగతనం జరిగిందని బయటపెట్టగానే ఎలక్షన్ కమిషన్ తన అధికారి వెబ్ సైట్ ను బ్యాన్ చేయడం జరిగిందని అన్నారు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేయకుంటే ఎందుకు వెబ్ సైట్ ను బ్యాన్ చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ 10 సంవత్సరాలుగా ఓట్ల నమోదు ప్రక్రియలో తప్పు జరుగుతుందని పదేపదే చెప్తున్నా.. విషయం ఈరోజు వెలుగులోకి వచ్చిందని ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆయన అన్నారు. దేశంలో నిజాయితీ గల నాయకుడు కేవలం రాహుల్ గాంధీ అని తెలిపారు. ఎల్లప్పుడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఆయన అని మానాల మోహన్ రెడ్డి అన్నారు.

అదేవిధంగా నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ.. దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ను తన ఆధీనంలో పెట్టుకొని దేశంలో ఎన్నో వేల ఓట్లు దొంగతనం గా సృష్టించి మోడీ అధికారంలోకి వచ్చాడు తప్ప.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదు అని , దేశానికి నైతికంగా మోడీ ప్రధాని కాదు అని కేశ వేణు అన్నారు. రాహుల్ గాంధీ మోడీ చేసిన దొంగ ఓట్ల ప్రక్రియను బయటపెడితే బీజేపీ నాయకులు ఏం చేయాలో తెలీక రాహుల్ గాంధీ పై అవాక్కులు చవాకులు పేలుస్తున్నారని అన్నారు. ప్రజలు ఇప్పటికైనా గమనించాలని, నిజమైన నాయకులు ఎవరు.. స్వార్థాల కొరకు వ్యవస్థలను వాడుకుంటున్నారో గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామ కృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి, వివిధ ఆలయాల చైర్మన్ లు లవంగ ప్రమోద్, మధు సుధాన్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ కృష్ణ, నగర ఎస్ సి సెల్ అధ్యక్షులు వినయ్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img