Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకార్పొరేట్ల ప్రయోజనాలే మోడీకి ముఖ్యం

కార్పొరేట్ల ప్రయోజనాలే మోడీకి ముఖ్యం

- Advertisement -

– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రజల ప్రయోజనాలకంటే కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధాని మోడీకి ముఖ్యమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మోటూరి హనుమంతరావు భవన్‌లో నవతెలంగాణ జనరల్‌ మేనేజర్‌ ఎ వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన విధానాలను అన్ని వ్యవస్థల్లోకి జొప్పిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యా, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో తమ తిరోగామి భావాలను ఎక్కిస్తున్నదని చెప్పారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి పట్ల దేశం యావత్తు సహేతుకంగా స్పందించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ప్రకటనలు, ఉప న్యాసాలు చేసిందని వివరించారు. ప్రతి అంశాన్ని అది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని విమర్శించారు. ఉగ్రవాదంపై యుద్ధం అనే పేరుతో దేశ ప్రజలకు అన్నీ అబద్ధాలే చెప్పిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేసి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్‌, ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad