Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయం‘వందేమాతరం’పై పార్లమెంటులో చర్చను ప్రారంభించిన మోడీ

‘వందేమాతరం’పై పార్లమెంటులో చర్చను ప్రారంభించిన మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్‌ వేదికైంది. లోక్‌సభలో సోమవారం ప్రధాని మోడీ ఆ చర్చను ప్రారంభించారు. మొత్తంగా ఈ చర్చ కోసం దిగువ సభలో 10 గంటల సమయాన్ని కేటాయించారు. విపక్ష కాంగ్రెస్‌ తరఫున ‘వందేమాతరం’పై లోక్‌సభలో పార్టీ ఉప నేత గౌరవ్‌ గొగొయ్, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు మాట్లాడనున్నారు. రాజ్యసభలో వందేమాతరంపై చర్చను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం ప్రారంభించనున్నారు. ఆయన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా ప్రసంగిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -