Thursday, July 31, 2025
E-PAPER
Homeజాతీయంట్రంప్‌ గురించి మాట్లాడటానికి మోడీకి భయమెందుకు?

ట్రంప్‌ గురించి మాట్లాడటానికి మోడీకి భయమెందుకు?

- Advertisement -

రాజ్యసభలో సీపీఐ(ఎం)
పక్షనేత జాన్‌ బ్రిట్టాస్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి ప్రధాని మోడీ మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్‌ బ్రిట్టాస్‌ ప్రశ్నించారు. ట్రంప్‌ చెత్తగా మాట్లాడుతున్నారని ప్రధాని చెప్పాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. బుధవారం రాజ్యసభలో పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున ఆయన మాట్లాడారు. ”డొనాల్డ్‌ ట్రంప్‌ చెత్త మాటలు మాట్లాడుతున్నారని మన ప్రధానమంత్రి నోట వినాలని కోరుకుంటున్నాం. కానీ ఆయన మాట్లాడకపోవడం దారుణం. మేము దానిని ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం” అని అన్నారు. పుల్వామా దాడి స్వతంత్ర భారత దేశంలో జరిగిన అతిపెద్ద భద్రతా వైఫల్యాలలో ఒకటని, నవ భారత్‌ గత వైఫల్యాలను జరుపుకుంటున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ దాడి కావచ్చు, ఉరి ఘటన కావచ్చు, పుల్వామా కావచ్చు, పహల్గాం దాడి కావచ్చు అని అన్నారు. వాస్తవానికి పుల్వామా స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యాలలో ఒకటిగా మిగిలిపోతుందని తెలిపారు. పధాని మోడీ పార్లమెంట్‌లో గంటకు పైగా మాట్లాడారని, కానీ ట్రంప్‌ గురించి ప్రస్తావించలేదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -