Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమోడీ అమెరికా ఏజెంట్‌

మోడీ అమెరికా ఏజెంట్‌

- Advertisement -

పేదల కన్నీళ్లను తుడిచేది ఎర్రజెండానే..
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి, మల్లు లకిë ొపుట్టపాకలో అమరవీరుల సంస్మరణ సభ
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన 11 ఏండ్ల పాలనలో ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూనే అమెరికాకు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లకిë విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో గురువారం పిట్ట రాములు అధ్యక్షతన సీపీఐ(ఎం) నాయకులు సుక్క అబ్బయ్య, మర్రి నర్సిరెడ్డి, నడికుడి శంకరయ్య, నడికుడి బచ్చయ్య 26వ వర్థంతి(సంస్మరణ) సభ జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ఎగుమతి, దిగుమతులపై ఎంత సుంకాలు విధించినా, పాకిస్తాన్‌పై యుద్ధంలో ఆంక్షలు పెట్టినా నోరు మెదపలేనంత హీనస్థితికి మోడీ దిగజారారని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని కమ్యూనిస్టు దేశాలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రపంచ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాలను అడ్డుకునే శక్తి కమ్యూనిస్టులకే ఉందని చెప్పారు. బీజేపీ ముస్లిం, క్రైస్తవులతోపాటు కమ్యూనిస్టులను ప్రధాన శత్రువులుగా భావిస్తోందన్నారు. నిత్యం ప్రజల పక్షాన పోరాడే కమ్యూనిస్టులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. పుట్టపాక(ఎర్రపాక)లో మళ్లీ ఎర్రజెండా ఎగరాలని ఆకాంక్షించారు. పుట్టపాక అమరుల ఆశయాల సాధన కోసం మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టాలన్నారు.
పేదల కోసం, పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడి దుండగుల చేతిలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబ సభ్యులు కూడా పార్టీలోనే కొనసాగుతూ ప్రజా పోరాటాలు నిర్వహించడం అభినందనీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë అన్నారు. పేదల కన్నీళ్లను తుడిచేది ఎర్రజెండా పార్టీలు మాత్రమేనని చెప్పారు. పేదల కోసం నికరంగా నిలబడి కొట్లాడిన నలుగురు నాయకులను చంపిన హంతక ముఠా సభ్యులకు పార్టీ స్థానిక నాయకులు ఉద్యమాలతోనే బుద్ధి చెప్పడం ప్రశంసనీయమన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగం వృథా కాదన్నారు. పేదలు ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందన్నారు. అంతకు ముందు అమరవీరుల స్మారక భవనంపై జూలకంటి రంగారెడ్డి జెండా ఎగరవేశారు. సీపీఐ(ఎం) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌, పుట్టపాక అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాస చారి, నాయకులు మల్లెపల్లి లలిత, సీఐటీయూ జిల్లా కోశాధికారి దోనూరు నర్సిరెడ్డి, దొడ యాదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మర్రి వసంత, సీనియర్‌ నాయకులు దొంతగాని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -