నవతెలంగాణ-హైదరాబాద్: మూడు దేశాల పర్యటనలో భాగంగా పీఎం మోడీ సోమవారం జోర్డాన్ వెళ్లిన తెలిసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు ఇథియోపియాకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఇథియోపియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇథియోపియాలో మోడీకి డిజిటల్ హోర్డింగ్‌లో స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం డిజిటల్ హోర్డింగుల్లో మోడీ ప్రత్యక్షమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇథియోపియా పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇథియోపియన్ ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో మోడీ విస్తృత చర్చలు జరపనున్నారు. ఇక ఇథియోపియా పర్యటన తర్వాత మోడీ ఒమన్ దేశానికి వెళ్లనున్నారు.
నేడు ఇథియోపియాకు ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



