ఇంతకీ ఏంటీ ఈ ఆపరేషన్ గంగా?
2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధంలో భారతీయులు చిక్కకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ‘ఆపరేషన్ గంగా’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాల్లో దాదాపు 16వేల మందిని స్వదేశానికి సురక్షితంగా తరలించామని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. మిగిలిన వారిని తరలించటానికీ మరిన్ని విమానాలు ఏర్పాటు చేసింది. ఇదంతా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం, దాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవటానికి మోడీ పన్నిన వ్యూహమని ప్రచారం జరిగింది)
ఇండిగో ప్రయాణికులు చేసిన పాపమేంటీ..?
ఇండిగో విమానాల రద్దుతో వారం రోజులుగా విమానాశ్రయాల్లో పిల్లా, పాపలతో ప్రయాణికులు పడుతున్న కష్టాలపై పార్లమెంట్‌లో మోడీ పల్లెత్తు మాట మాట్లాడకపోగా మీరు రైళ్లో వెళ్లండి.. మీకు రిఫండ్ ఇప్పిస్తామంటోన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టడమే తమ సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యమన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
5శాతం విమానాలు కుదించాలి : డీజీసీఏ
ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వుండేందుకు పూర్తి స్థాయిలో షెడ్యూళ్ళను స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా దాదాపుగా 400 నుంచి 500వరకు విమానాల్లో కోత విధించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్ణయించింది. రోజువారీ 2300 విమానాలు నడిపే ఈ సంస్థ ఇకపై 1800 నుంచి 1900 వరకు మాత్రమే విమానాలు నడపనుంది. పూర్తి స్థాయిలో అన్ని విమానాలు నడపడంలో విఫలమైనందున 5శాతం లేదా దాదాపు 115 విమానాల్లో కోత విధించాలని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ : రైతు ఉద్యమాలు మొదలుకుని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ప్రధాని మోడీ తీరుపై పలు అనుమానాలు, సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఆయన విదేశీ పర్యటనల్లో ఉండడం గమనార్హం. ఇక అక్కడ జరిగే సమా వేశాల్లో భారత్ వెలిగిపోతుందని దేశంలోని వాస్తవాలను కప్పిపుచ్చి ఉపన్యాసాలు ఇవ్వటం ఆయనకు పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులతో చెడుగుడు ఆడుతున్న సమయంలో… పార్లమెంట్‌లో వందేమాతరం అంశాన్ని మోడీ తెరపైకి తెచ్చారనే చర్చ నడుస్తోంది. నాడు ఆపరేషన్ గంగా నిర్వహించిన సమయంలో మోడీని దేవదూత దిగివచ్చినట్టు కార్పొరేట్ మీడియా హైలెట్ చేసింది. నేడు ఇండిగో ప్రయాణికులు పడుతున్న కష్టాలు ఆ మీడియా కండ్లకు కనిపించడం లేదు. వేలాది రూపాయలతో టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో మోడీ స్ట్రాంగ్ పొలిటీషియన్ అంటుంటే.. బీజేపీ భక్తజనమంతా 56 అంగుళాల ఛాతీ దేన్నైనా ఢ కొంటుందని భజన చేస్తుంటారు. మరి ఇండిగో ప్రయాణికులు ఏం పాపం చేశారని..వారిపై ఎన్డీఏ సర్కార్ ఎందుకని దయ చూపనంటోంది. దీని వెనుక బీజేపీకి ఇండిగో సంస్థ ఇచ్చిన విరాళాలే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇండిగో రచ్చపై జాయింట్ పార్లమెంటరీ కమిషన్ (జేపీసీ)వేయమని విపక్షాలు అడిగినా పట్టించుకోవటం లేదు. దగ్గర్లో ఎన్నికలేవి లేవని కాబోలు.. ఏ మాత్రం పట్టించుకోకుండా వందేమాతరంపై చర్చతో సమస్యను పక్కదారి పట్టించేస్తున్నారు. మెజార్టీబలం ఉండటంతో పార్లమెంట్‌లో ఏం చేసినా చెల్లుతుందనీ, దేశ ప్రజలతో ఎలాగైనా ఆడుకోవచ్చనే భావనలో మోడీ సర్కార్ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండిగో ప్రయాణికుల విషయంలో ఎన్డీఏ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును దేశం యావత్తు సున్నితంగా గమనిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మోడీ చేతలకు అర్థాలే వేరులే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



