Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకార్మిక సంఘాల విచ్ఛిన్నానికి మోడీ కుట్ర

కార్మిక సంఘాల విచ్ఛిన్నానికి మోడీ కుట్ర

- Advertisement -

– శ్రమ శ్రామికులది.. ఫలితం పెట్టుబడిదారులకా..?
– హక్కుల రక్షణకు సంఘటితంగా ముందుకు పోదాం: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ- పెబ్బేరు

కార్మికులు చెమట చుక్కలు చిందించడం ద్వారా వచ్చే సంపదను ప్రధాని మోడీ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా నాలుగో మహాసభ సోమవారం ప్రారంభమైంది. అనంతరం సహారా ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. ప్రజాస్వామ్య దేశంలో పాలకుల పనితీరుపై ప్రశ్నించాలని చెప్పారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు.. ప్రజల పక్షాన పని చేయకుండా పెట్టుబడిదారుల పక్షాన పనిచేస్తున్నారని విమర్శించారు. సంపద పెట్టుబడిదారుల పెట్టుబడితో రాదని, రైతులు, శ్రామికులు, వ్యవసాయ కార్మికుల శ్రమతో సృష్టించబడుతుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. పని చేసే ప్రతి ఒక్క కార్మికునికీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మోడీ పెట్టుబడిదారుల పక్షాన ఉంటే, కార్మికుల పక్షాన వామపక్షాలు, సీఐటీయూ, ఎర్రజెండా అండగా ఉండి పోరాడుతున్నాయని స్పష్టం చేశారు. స్కీం వర్కర్లు, గ్రామపంచాయతీ, మున్సిపల్‌ వర్కర్లు, బీడీ కార్మికులు, అన్ని రంగాల కార్మికుల బతుకులు బాగుపడాలన్నా.. శ్రమకు తగిన ఫలితం దక్కాలన్నా పెట్టుబడిదారుల విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులపై దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం సంఘటితంగా ఉండకుండా చేయాలనే కుట్రను, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9న ఐక్య ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా చేశామని గుర్తు చేశారు. కలిస్తే నిలుస్తాం.. నిలిస్తే గెలుస్తాం.. ఇది మన సిద్ధాంతంగా పెట్టుకొని కలుద్దాం.. నిలుద్దాం.. గెలుద్దాం అంటూ సంఘటితంగా ముందుకు పోదామని సూచించారు. సీఐటీయూ ఆల్‌ ఇండియా మహాసభ విశాఖపట్నంలో జరగనుందని, అంతకు ముందుగా జిల్లా, రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నామని తెలిపారు. సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, మండల రాజు, పుట్టా ఆంజనేయులు, జి.బాలయ్య, నిక్సన్‌, శివలీల, శారద, ఆర్‌ఎన్‌.రమేష్‌, గోనెల ఆంజనేయులు, ఉష, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img